సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నియోజకవర్గం కూటమి పార్టీల తరపున జనసేన అభ్యర్థి గా పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు)నేడు బుధవారం భీమవరం తాలూకా తాపీపనివారి సంఘం భవనంలో తాపీ పని కార్మికులతో సమావేశం అయ్యి వారికి మే డే శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో జనసేన చినబాబు, టీడీపీ కోళ్ల నాగేశ్వరరావు తదితర నేతలు పాల్గొన్నారు. తదుపరి, పలు శ్రామిక సంఘాల తో సమావేశం అయ్యారు. ఇప్పటివరకు ఈ ప్రభుత్వ పాలనలో మీరు ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారని వచ్చే మే 13 న ఎన్నికలలో కూటమి పార్టీలు విజయం సాధించడం ఖాయం అని తాను ఎమ్మెల్యే అయిన తరువాత మీ సమస్యలు అన్ని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. జనసేన జడ్పిటిసి గుండా జయప్రకాశ్ తో కలసి వీరవాసరం మండలంలోని జగన్నాధపురం, రాయాకుదురు, కొణితివాడ, వీరవల్లి పాలెం, గవరపాలెం, మాడుగుపోలవరం గ్రామాలలో విస్తృతంగా ఎన్నికల ప్రచారా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో స్థానిక టీడీపీ జనసేన నేతలు,మహిళా నేతలు ఆయనకు పుష్పాలు జల్లుతూ ఆయనకు ఘన స్వాగతం పలకడం జరిగింది. పలువురు గ్రామపెద్దలు, ఎంపీటీసీ లు ను అంజిబాబు స్వయంగా వారి ఇండ్లకు వెళ్లి సహకారం అభ్యర్ధించడం జరిగింది. ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ.. ఈసారి ఎన్నికలో గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి పధంలో నడిపించడం,మహిళా సంక్షేమం, అందరికి త్రాగునీరు అందించడంతో పాటూ , రైతులకు యువత కు వ్యాపార వర్గాలకు అన్ని విధాలా అండగా ఉంటానని, పిలిస్తే పలుకుతానని, అందరికి అందుబాటులో ఉంటానని అంజిబాబు హామీ ఇవ్వడం జరిగింది.
