సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్ : మరో 11 రోజులలో ఎన్నికల పోలింగ్ ఉండగా, జనసేన కీలకమైన గాజు గ్లాస్ గుర్తు విషయంలో జనసేన పార్టీ కి ఏపీ హైకోర్టులో షాక్ తగిలింది. ఎన్నికల సంఘం నిర్ణయంపై కోర్టును ఆశ్రయించిన జనసేనకు.. హైకోర్టులో స్వతంత్ర అభ్యర్థులకు కూడా గాజు గ్లాస్ గుర్తు కేటాయింపుపై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా జనసేన పోటీ చేయని చోట స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించడాన్ని హైకోర్టు సమర్థించింది. ఈ క్రమంలోనే జనసేన ఎంపీ అభ్యర్థులు పోటీ చేస్తున్న చోట మాత్రమే ఈ గుర్తును స్వతంత్రులకు కేటాయించవద్దని ఎన్నికల సంఘానికి సూచించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు మార్గదర్శకాలపై సమీక్ష చేయనున్నట్టు ఈసీ తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *