సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, గురువారం భీమవరం టౌన్ లోని 11,12, 13, 14, 15, 24 వార్డులలో జరిగిన ఇంటింట ప్రచార కార్యక్రమంలో ప్రభుత్వ విప్ మరియు భీమవరం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ మరియు నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిని, గూడూరి ఉమాబాల గారి భర్త గూడూరి జగదీష్, మరియు స్టేట్ క్రిస్టియన్ మైనారిటీ సెల్ చైర్మన్, మేడిది జాన్సన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు. వైసీపీ కి 2 ఓట్లు వేసి ఘనవిజయం అందించాలని అభ్యర్ధించారు. పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలంలో జరిగిన ప్రచార కార్యక్రమంలో నరసాపురం వైసీపీ ఎంపీ అభ్యర్థి గూడూరి ఉమాబాల మరియు తణుకు నియోజకవర్గ వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి కారుమూరి నాగేశ్వరరావుతో కల్సి ఓటర్లు ను ఓట్లు అభ్యర్ధించారు. మంచిలి,ఆరవల్లి, దంతుపల్లి,ఉనికిలి,లక్ష్మీనారాయణ పురం, ఈడూరు, కంచుమర్రు,కొమ్మర,పాలూరు, గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో మహిళలు ప్రజలు పెద్ద ఎత్తున హాజరై ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఉమాబాల మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా జగనన్న ప్రభుత్వంలో పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించి పేద కుటుంబాలకు ఆర్థికంగా చేదోడును అందించారన్నారు. పేద విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఇస్తున్నదేశంలో ఏకైక సీఎం జగన్ మాత్రమే నన్నారు.
