సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇప్పటికే ఢిల్లీ పంజాబ్ రాష్ట్రాలలో అధికారంలో ఉండి ఉత్తరాది రాష్ట్రాలో బలం పుంజుకొంటు ప్రధాని మోడీ నాయకత్వంలోని ఎన్డీయే కి సవాలుగా నిలచిన ఆమ్ అండ్ ఆద్మీ పార్ట్ అధినేత, ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు లో భారీ ఊరట లభించింది. జూన్ 1 వరకు కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూన్ 2న తప్పనిసరిగా సరెండర్ కావాలని ఆదేశం ఇచ్చింది. సీఎంగా బాధ్యతలు నిర్వర్తించకూడదని పేర్కొంది. లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని ఢిల్లీ సీఎం కోర్టులో పిటిషన్ దాఖలుచేయగా… విచారణ జరిపిన ధర్మాసనం కేజ్రీవాల్ కు సానుకూలంగా తీర్పు ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మార్చి 21న అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
