సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: శ్రీ రాజశ్యామల దేవి అధికారం, విజయాలను అందిస్తుందని ప్రతీతి.. ప్రగాఢ నమ్మకం దేశంలోని పలువురు రాజకీయనేతలలో ఉంది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి లోని తన నివాసంలో 45 మంది నిష్ణాతులయిన వేద పండితులతో కాస్త గోప్యంగా .. గత 41 రోజులుగా చేపట్టిన శ్రీ మహా రుద్ర సహిత రాజశ్యామల సహస్ర యాగం ముగిసింది. నిజానికి కొద్దీ నెలలు ముందు విశాఖలో శారదా పీఠంలో జరిగిన రాజ్య శ్యామల యాగం పూర్ణాహుతి లో కూడా సీఎం జగన్ పాల్గొన్నారు. తదుపరి ఇటీవల ఎన్నికలకు ముందు తన నివాసంలోనే ఏర్పాటు చేసుకొన్నా శ్రీ రాజ్య శ్యామల దేవి కోవెల నిర్మించి ఆమెను ఆరాధిస్తూ యాగం కోసం సీఎం జగన్ ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తుంది. ఈ యాగం వివరాల్లో సీఎం జగన్ గోప్యం పాటించారని సమాచారం. యాగం పూర్తీ కావడం తో నిన్న గురువారం ఫొటోలు బయటకు విడుదల చేసారు. ఈ యాగం పూర్తీ చేసుకొని, వేద పండితుల కు సత్కారాలు అస్సిసులు తీసుకోని బయటకు వచ్చిన సీఎం జగన్ ఉత్సహంగా ఐ ప్యాక్ టీమ్ ఆఫీస్ కు వెళ్లి తమ వైసీపీ పార్టీ అసాధారణ గెలుపు తో దేశం యావత్తు ఆంధ్ర వైపు చూస్తుందని అలాంటి ఘనవిజయం సాధిస్తామని సంచలన ప్రకటన చెయ్యడం గమనార్హం. 2019 ఎన్నికల కు ముందు కూడా జగన్ శ్రీ రాజశ్యామల దేవి యాగం నిర్వహించడం గమనార్హం.
