సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కొరటాల శివ-ఎన్టీఆర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ పాన్-ఇండియన్ మూవీ దేవర. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ దసరా పండుగ కానుకగా అక్టోబర్ 10న విడుదల కానుంది. ఇదిలా ఉండగా, ఈ సినిమా నుండి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫస్ట్ సింగిల్ “ఫియర్ సాంగ్”ని మేకర్స్ నేడు, జూనియర్ ఎన్టీఆర్ జన్మదినం కానుకగా విడుదల చేశారు.ఈ పాటతో అభిమానులకు ట్రీట్ ఇచ్చినప్పటికీ పాటలో అనిరుథ్ ఎక్కువ కనపడి గతంలో దేవర ఫస్ట్ లుక్ లో చూపిన సన్నివేశాలనే మరల మిక్స్ చేసి పాట డిజైన్ చెయ్యడం అభిమానులను కొంత నిరాశ పరచింది. కొత్త షాట్ లు కలిపితే బాగుండేది. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో ఈ పాటను విడుదల చేయగా.. తెలుగు వర్షెన్‌కు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అంధించాడు. ఇక అనిరుధ్ రవిచందర్ మ్యూజికల్ గా వచ్చిన ఈ సాంగ్ ఆకట్టుకుంటుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *