సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఒకనాటి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా రాజకీయాలు శాసించి తెలుగు దేశం పార్టీ ఆవిర్భం నుండి జిల్లా అగ్రనేతగా, జిల్లా జడ్పీ ఎన్నికలలో తనకు నచ్చినవారికి చైర్మెన్ ఇప్పించే చొరవ అధిష్టానం దగ్గర సాధించిన కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల వెంకట కృష్ణారావు(కృష్ణబాబు) నేడు, మంగళవారం మృతి చెందారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ హాస్పటల్లో చేరారు. ఇవాళ తెల్లవారుజామున ఆయన చనిపోయినట్లు వైద్యులు, కుటుంబ సభ్యులు ధృవీకరించారు. కృష్ణబాబు మృతదేహాన్ని ఆయన స్వగ్రామం దొమ్మేరుకు తరలించారు కుటుంబ సభ్యులు. బుధవారం నాడు అత్యంతక్రియలు నిర్వహించే అవకాశం ఉంది.కాగా, టీడీపీకి కంచుకోట అయిన కొవ్వూరు నియోజకవర్గంలో తణుకు ఆంధ్రా షుగర్స్ అధినేత ముళ్లపూడి హరిశ్చంద్రప్రసాద్ మేనల్లుడు అయిన పెండ్యాల కృష్ణబాబు ఇక్కడి నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే, 2009 నుండి నియోజకవర్గాల పునర్విభజనలో కొవ్వూరు ఎస్సీ నియోజకవర్గంగా మారడంతో కృష్ణబాబు తెరపై నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ప్రస్తుత సీఎం జగన్ గతంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆయనకు మద్దతు ఇచ్చారు.అయితే ప్రజా ప్రతినిధి ఎవరు గెలిచిన పెండ్యాల కుటుంబానిదే ఈ నియోజకవర్గంలో పైచేయి. ముఖ్యంగా కృష్ణబాబు సోదరుడు అచ్చిబాబు అజమాయిషీ ఇప్పటికి కొనసాగుతుంది.
