సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల సింగపూర్‌లో శరవేగంగా పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో అవి కోవిడ్ KP.2 , KP.1 కొత్త వేరియంట్లు..గా గుర్తించారు. తాజగా అవి భారతదేశంలో కూడా వ్యాప్తి చెందుతున్నాయి. అధికారిక సమాచారం ప్రకారం.. ఇండియాలో 290 KP.2 కేసులు, 34 KP.1 కేసులు నమోదయ్యాయి. అయితే.. ఇవి JN1 సబ్ వేరియంట్లు అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా.. కోవిడ్ కొత్త వేరియంట్లతో ఎలాంటి ప్రమాదం లేదని నివేదిక పేర్కొంది. కొవిడ్ KP.2, KP.1 వేరియంట్ల కేసులతో భయాందోళన చెందాల్సిన అవసరం లేదని ఆరోగ్య శాఖ తెలిపింది.ఈ KP.1 వేరియంట్ 34 కేసులు ఏడు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో కనుగొన్నారు. వీటిలో 23 కేసులు పశ్చిమ బెంగాల్ లో గుర్తించారు. గోవా (1), గుజరాత్ (2), హర్యానా (1), మహారాష్ట్ర (4) రాజస్థాన్ (2), ఉత్తరాఖండ్ (1) కేసులు నమోదయ్యాయి. మరోవైపు.. KP.2 కేసులు 290 నమోదయ్యాయి. వాటిలో గరిష్టంగా 148 కేసులు మహారాష్ట్రలో నమోదయ్యాయి. ఢిల్లీ (1), గోవా (12), గుజరాత్ (23), హర్యానా (3), కర్ణాటక (4), మధ్యప్రదేశ్ (1), ఒడిశా (17), రాజస్థాన్ (21), ఉత్తరప్రదేశ్ ( 8), ఉత్తరాఖండ్ (16), పశ్చిమ బెంగాల్ (36) కేసులు నమోదయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *