సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో ఎన్నికల నేపథ్యంలో ఏర్పడిన ఉద్రిక్తలు నేపథ్యంలో జూన్ 4 న ఎన్నికల ఫలితాలు నేపథ్యంలో మరింత ఉద్రిక్తంగా ఉంటుందని కేంద్ర ఇంటెలీజెన్స్ నివేదిక ఆధారంగా రాష్ట్రంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో తాజగా డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన మూడు రోజుల్లో 301 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్లు .. ఎన్నికల పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి 4,668మందిని గుర్తించి, పలువురిని అరెస్టు చేశామని చెప్పారు. వీరిలో రాజకీయపార్టీల నేతలు ఏ పార్టీకి చెందిన ఉపేక్షించలేదని అన్నారు. పోలింగ్ ముందు రోజు నమోదైన కేసుల్లో 1522, పోలింగ్ రోజు నమోదైన కేసుల్లో 2790, పోలింగ్ తర్వాత నమోదైన కేసుల్లో 356మందిని గుర్తించినట్లు వివరించారు. ఓట్ల లెక్కింపు, ఆ తర్వాత ఏదైనా హింసాత్మక ఘటనలు జరిగే అవకాశం ఉన్నా దృష్ట్యా, అనుమానిత వ్యక్తుల కదలికలపైనా పోలీసులకు(డయల్ 100) సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నేర నియంత్రణలో పోలీసులకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు జూన్ 4న ముగిసినా నెలాఖరు వరకూ కేంద్ర సాయుధ బలగాలను రాష్ట్రంలోనే కొనసాగించాలని సీఈసీ ఆదేశించింది. ఇప్ప్డటికే కేంద్ర హోంశాఖ పంపిన 25 కంపెనీల ఫోర్స్….రాష్ట్రంలోని సమస్యాత్మక ప్రాంతాల్లో ఉంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటై ప్రశాంత వాతావరణం ఏర్పడిన తర్వాతే కేంద్ర సాయుధ బలగాలు రాష్ట్రం నుంచి బయటకు వెళ్లేలా ఆదేశాలు ఉన్నాయి.
