సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ వైద్య సేవలను నేటి బుధవారం నుంచి తాత్కాలికంగా నిలిపివేయడానికి సిద్ధం అయ్యారు. ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన బిల్లులు సుమారుగా 40 కోట్లు వరకు పేరుకుపోవడంతో జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు ఆసుపత్రులు ఈ నిర్ణయం తీసుకున్నాయి. దీనితో రోగులలో ఆందోళన పెరిగింది. పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం, తాడేపల్లి గూడెం, తణుకు, పాలకొల్లు, నరసాపురం పట్టణాల్లో 70 ఆసుపత్రులు ఆరోగ్యశ్రీలో వైద్యం అందిస్తున్నాయి. ఇక ఏలూరు జిల్లాలో 31 ప్రైవేటు ఆసు పత్రులులో ఇప్పటికే ఆసుపత్రిలో చేరిన వారికి ఆరోగ్యశ్రీ అనుమతి పొందిన వారికి యధావిధిగా సేవలు కొనసాగిస్తారు. నేటి బుధవారం నుంచి కొత్తగా ఆరోగ్యశ్రీ రిజి స్ట్రేషన్‌ అప్రూవల్‌ పొందకుండా నిర్ణయాలు తీసుకున్నారు. దీనిపై జిల్లా వైద్య అధికారులు ఆరోగ్యశ్రీ ట్రస్టు కో ఆర్డినేటర్స్ మాట్లాడుతూ.. ఈ నెల 22వ తేదీ నుంచి ఆరోగ్యశ్రీలో వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యాలు మాకు ఎలాంటి నోటీసు ఇవ్వలేదు. ఏలూరులోని ఒక్క ఆశ్రం ఆసుపత్రి వారు సమాచారం ఇచ్చారు. నేటి బుధవారం ఉదయం వెళ్లి వారితో సేవలు కొనసాగించేలా చర్యలు తీసుకొన్నాం. అలాగే భీమవరం లోని ఒమేగా కాన్సర్ హాస్పటల్ లో ఆరోగ్యశ్రీ యధావిధిగా అమలు చేస్తున్నారు. భీమవరం మరియు ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో అన్ని విభాగాలకు ప్రత్యేక వైద్య నిపుణులు ఉన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ బకాయిలను 203 కోట్ల మేర చెల్లింపులు చేపట్టినట్లు, ప్రైవేటు హాస్పటల్స్ లో సేవలు కొనసాగుతాయని రాష్ట్ర ఆరోగ్యశ్రీ సీఈఓ ఆర్ లక్ష్మి షా ప్రకటించారు. ఆసుపత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌స్ తో మాట్లాడాం. రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగదు అని హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *