సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లాలో మాచర్ల నియోజకవర్గంలోని పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రంలో (202)ఈవీఎంని పగలగొట్టిన ఆరోపణపై..సీసీ ఫుటేజ్ వీడియో వైరల్ అయిన నేపథ్యంలో నమోదైన కేసులో మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్టారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసినట్టు? తెలుస్తోంది. సంగారెడ్డి సమీపంలో ఆయనను అరెస్టు చేసినట్లు వార్తలు వస్తున్నప్పటికీ.. పిన్నెల్లి అరెస్ట్‌ని పోలీసులు ఇప్పటివరకు అధికారికంగా నిర్ధారించలేదు. దీంతో సస్పెన్స్ కొనసాగుతోంది. కాగా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్టా రెడ్డి కోసం నేటి బుధవారం ఉదయం నుంచి పోలీసులు గాలిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్, జడ్చర్ల పరిసర ప్రాంతాల్లో ఏపీ పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. పిన్నెల్లి ఇద్దరు సోదరులు కూడా ఈ ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం ఉండడంతోనే తెలంగాణ పోలీసులు సహకారం తో తనిఖీలు చేసినట్లు సమాచారం.
