సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విశ్వ విఖ్యాత సహజ నటుడు కమల్ హాసన్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ “భారతీయుడు2”. బ్లాక్ బస్టర్ మూవీ “భారతీయుడు” సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కుతుంది.ఈ సినిమాను దర్శకుడు శంకర్ భారీ బడ్జెట్ తో గత 4 ఏళ్లుగా తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాలో కాజల్ ,సిద్దార్థ్ ,రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రలలో నటిస్తుండగా బాబీ సింహా,ఏస్.జె.సూర్య వంటి తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు.షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలై 12న గ్రాండ్ గా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం పై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి.ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది.ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది.ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమాలోని ఫస్ట్ సాంగ్‌ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేసారు.యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచందర్ నేతృత్వంలో రూపొందిన .”పారా”అంటూ సాగే ఈ పాట ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించేలా వుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు హైలైట్ అని చెప్పొచ్చు.
