సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఈ మండు వేసవిలో పిల్లలలకు సెలవు దినాలు కావడంతో ప్రయాణాలు ఎక్కువ ఉంటాయి. అందులో బస్సు కన్నా పిల్లలతో సుఖవంతమైన రైలు ప్రయాణాలకు ఎక్కువ ప్రయాణికులు ప్రాధాన్యత ఇస్తారు. ఐతే ఇదే సమయంలో విజయవాడ, నిడదవోలు డివిజన్లలో రైల్వే నిర్వహణ పనులు చేపడుతున్నందున కీలక రైళ్లను ఈ రూట్లలో ఈనెల 26 వరకు, మరికొన్నింటిని నెలాఖరు వరకు రద్దు కావడంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యముగా జిల్లా కేంద్రం భీమవరం టౌన్ మీదుగా నడిచే రైళ్లలో ఇటు విజయవాడ ,గుంటూరు, అటు తణుకు, నిడదవోలు రాజమండ్రి, కాకినాడ వైపు వెళ్లే రైళ్లు చాల రద్దీగా ఉంటాయి. ఉన్న రైళ్ళే సరిపోవు అనుకుంటుంటే.. ఈనెల 15 నుంచి నరసాపురం– గుంటూరు పాస్ట్, నరసాపురం విజయ వాడ, నరసాపురం– నిడదవోలు, రాత్రి నరసాపురం నుంచి వెళ్లే రాజమండ్రి వెళ్లే రైళ్లను రద్దు చేసింది. దీంతో ఉదయం సమయంలో విజయవాడ వెళ్లాలంటే 11 గంటలకు నాగర్ సోల్ ఎక్స్‌ప్రెస్ ఒక్కటే ఉండటంతో బండి సరిపోక ప్రయాణికులు స్లీపర్ రిజర్వేషన్ బోగీలలో కూడా ఎక్కిస్తున్నారు... ఇక రాజమండ్రి నిడదవోలు వైపు వెళ్లే రైళ్లు లేక పోవడంతో నరసాపురం నుంచి భీమవరం, తణుకు, నిడదవోలు వెళ్లే ప్రయాణికులు బస్సులు మాత్రమే దిక్కు అయ్యాయి. ఇటు వ్యాపారులు, ఉద్యోగస్తులు, ఆస్పత్రులకు, కోర్ట్ పనులకు విజయవాడ నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఈ ఎక్స్‌ప్రెస్‌ను ఆశ్రయిస్తారు. దీనిపై డెల్టా ప్రాంతంలోని పలు ప్రజా సంఘాలు రైల్వే శాఖ కు విజ్ఞప్తులు చేస్తున్నారు.
