సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణానికి కేవలం 11 కిమీ దూరంలో కాళ్ళ మండలంలో .. పురాణాల ప్రకారం స్వయం భువుడుగా వెలసిన కాళ్ళకూరు గ్రామం లో మహిమానిత్వ , శ్రీ వేంకటేశ్వరస్వామి వారి తిరు కల్యాణ మహోత్సవాల్లో భాగంగా నేడు, గురువారం మధ్యాహ్నం 3న్నర నుండిస్వామివారి సుమారు 30 అడుగుల రథోత్సవం వైభవంగా సాగింది. వేద మంత్రాల నడుమ పలు మేళతాళలతో సుందరంగా అలంకరించిన రథంపై స్వామివారు ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు. తొలుత రథంపై ఆసీనులైన స్వామికి ప్రత్యేక పూజలు చేసిన తరువాత రధోత్సవం ప్రారంభం అయ్యింది. కార్యక్రమంలో ఏర్పాటు చేసిన కేరళ డప్పులు హైలైట్ గా నిలవగా, బుట్ట బొమ్మలు, శక్తి వేషాలు, తీన్మార్‌ డప్పులు, మేళతాళాలు, డీజే సిస్టం భక్తులను యువతను ఉత్సహపరిచాయి. . రథోత్సవంలో పాల్గొన్న భక్తులు రథాన్ని లాగేందుకు గోవిందా.. గోవిందా.. అంటూ పోటీపడటంతో వీధులన్నీ ఉమ్మడి పశ్చిమ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో కాళ్ళకూరులో దారులన్నీ కిక్కిరిసిపోయాయి. నేటి సాయంత్రం రామాలయం ప్రక్కన శ్రీ స్వామివారి స్థలంలో భారీ ఎత్తున బాణాసంచా కాల్పులు నిర్వహించడం జరిగింది. నేటి 8గంటలకు రాత్రి ఆలయ ఆవరణలో స్వాతి సినీ సంగీత విభావరి ఏర్పాటు చేస్తున్నారు. కార్యక్రమాలను కార్యనిర్వాణాధికారి ఎం అరుణ్ కుమార్ పర్యవేక్షిస్తున్నారు. కాళ్ల పోలీసులు ప్రత్యేక బందోబస్తు నిర్వహించారు.ఉత్సవాల ముగింపు గా జూన్ 1వ తేదీన భారీ అఖండ అన్న సమారాధన నిర్వహించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *