సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు రాష్ట్రాలలో ఎన్నికలు పోలింగ్ ముగిసింది. ఇక దేశవ్యాప్తంగా కూడా ఎన్నికలు ముగింపు దశకు చేరుకొంటున్నాయి. మరో ప్రక్క దేశవ్యాప్తంగా నిత్యావసర వస్తువులు,కూరగాయల ధరలు టమాటా ఉల్లి పాయలతో సహా కేజీ 35- 40 రూపాయల వరకు పెరుగుతూ వస్తున్నాయి. మొన్నటి వరకు 55 ధర ఉన్న క్యాపిసికం కేజీ 80 పైకి పెరిగింది. ఇక పప్పుల ధరలు భారీగా పెరిగాయి.మార్చినెలలోని రేట్లతో పోల్చితే ప్రస్తుతం వివిధ రకాల పప్పుల ధర రూ.30కి పైగా పెరిగింది.రిటైల్‌ మార్కెట్‌లో కందిపప్పు కిలో రూ.180- శనగపప్పు కిలో రూ.90కి చేరిపోయింది. వాస్తవంగా ప్రతి కుటుంబంలో కూరగాయలతో సమానంగా పప్పులను వంటలలో వినియోగిస్తారు..కందిపప్పు ను తెలుగు రాష్ట్రాలలోని పలు ప్రాంతాలకు ఆస్ర్టేలియా నుంచి ఎక్కువగా దిగుమతి అవుతుందని వ్యాపారులు అన్నారు. లోకల్‌ పప్పులతో పోల్చితే విదేశీ సరుకు రేట్లు తక్కువగా ఉంటుంది. రెండు నెలలుగా ఆస్ర్టేలియా నుంచి కందిపప్పు దిగుమతి బాగా తగ్గడంతో మహారాష్ట్ర, లాతూరు నుంచి వచ్చే పప్పులకు డిమాండ్‌ పెరిగింది. ఈ క్రమంలో హోల్‌సేల్‌ వ్యాపారులు కిలోకు రూ.10 చొప్పున పెంచి అమ్ముతుండగా, రిటైల్‌ మార్కెట్‌లో కిలోకు రూ.30 -40 వరకు అదనంగా పెంచి అమ్మకాలు చేస్తున్నారు. అయితే కందిపప్పుతోపాటు మినపపప్పు, శనగపప్పు, చింతపండు ధరలు పెరగడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు ప్రత్యేక దృష్టిసారించి ధరల నియంత్రణపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *