సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు రాష్ట్రాలలో అనేక మంది నకిలీ డాక్టర్స్ చెలామణి అవుతున్నారు. దొరికితేనే దొంగ.. లేకపోతె డాక్టర్ బాబులు అయిపోతారు. అయితే కొందరు నకిలీ డాక్టర్స్ కు కూడా కొందరికి మంచి హస్తవాసి ఉంటుంది మరి. గత గురువారం తెలంగాణ వైద్య మండలి సభ్యులు ఐడీపీఎల్, చింతల్, షాపూర్‌నగర్ ప్రాంతాల్లో నిర్వహించిన దాడులలో ఏకంగా 50 మంది నకిలీ వైద్యులను గుర్తించారు. ఎనిమిది మంది సభ్యులు వేర్వేరు బృందాలుగా ఒకేసారి తనిఖీలు జరిపారు. నకిలీ వైద్యులు తమ ఆరోగ్య కేంద్రాల్లో రోగులను చేర్చుకుని పెద్ద సంఖ్యలో యాంటీబయాటిక్స్ సైతం ఇస్తున్నట్లు గుర్తించారు. ఫేక్ సర్టిఫికెట్లు తో వైద్యులుగా పేర్కొంటూ బోర్డు పెట్టుకోవడమే కాక, వారికి అనుబంధంగా మెడికల్ షాపులు, డయాగ్నొస్టిక్ సెంటర్లు కూడా పెట్టుకున్నారని అధికారులు తెలిపారు. దాదాపు యాభై మంది నకిలీ వైద్యులపై ఎఫ్ఐఆర్లు నమోదు కాగా, ఇద్దరిని జైలుకు పంపినట్లు ప్రకటించారు. తనిఖీల్లో డాక్టర్ ప్రతిభాలక్ష్మి, డాక్టర్ కిరణ్ కుమార్, డాక్టర్ సన్నీ డేవిస్, డాక్టర్ ఇమ్రాన్ అలీ, డాక్టర్ కే. విష్ణు, పాండు తదితరులు పాల్గొన్నారు. ఏపీలో కూడా తనిఖీలు చెయ్యలేకాని..
