సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల విడుదల అవుతున్న సినిమాలలో ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ సినిమా కు మంచి క్రేజ్ ఉన్నమాట వాస్తవం.. ఇప్పటికే ఆ సినిమా ట్రైలర్ లో మోతాదు మించి అసభ్య పదజాలం ఉన్నప్పటికీ మంచి కంటెంట్ ఉన్నట్లు తెలుస్తుంది. మంచి పామ్ లో ఉన్న యువ క్రేజీ హీరో విష్వక్‌సేన్ తో కృష్ణ చైతన్య తెరకెక్కించిన చిత్రమిది. అంజలి, నేహాశెట్టి కథానాయాకలు. హైపర్‌ ఆది కీలక పాత్ర పోషించారు. మే 31 ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా గత రాత్రి మంగళవారం జరిగిన ప్రీ రిలీజ్‌ వేడుకలోఅగ్ర హీరో నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భముగా హైపర్ అది మాట్లాడుతూ.. నందమూరి నటసింహం బాలకృష్ణ, కొణిదెల కొదమసింహం పవన్ కల్యాణ్‌ కలిసి అసెంబ్లీలో అడుగుపెడితే ఎలా ఉంటుందో ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ సినిమా చూసినా అలానే ఉంటుంది’’ అన్నారు ‘ప్రపంచంలో ఎక్కడికెళ్లినా నేను తెలుగు వాడిని అని గర్వంగా, ధైర్యంగా చెప్పుకొంటున్నామంటే .. తెలుగుజాతి గౌరవాన్ని రామారావు గారు కాపాడితే ఆయన గౌరవాన్ని బాలకృష్ణగారు నిలబెడుతూ వస్తున్నారు. ‘బాలకృష్ణ తిట్టారు.. కొట్టారు’ అంటూ కొందరు వార్తలు రాస్తుంటారు. కానీ, ఆయన కొన్ని వేల మంది పేద ప్రజల బతుకులను నిలబెట్టారు. బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రి ద్వారా ఎంతో మంది పేద వారికి సాయం చేశారు. అప్పటి జనరేషన్ కోసం ‘ఆదిత్య 369’, ‘భైౖరవద్వీపం’లాంటి హిట్‌ చిత్రాలు ఇచ్చారు. మరో జనరేషన్‌ వాళ్లుకు ‘సమరసింహారెడ్డి, ‘నరసింహానాయుడు’ లాంటి చిత్రాలు అందించారు. ఇంకో జనరేషన్‌ వాళ్లుకు ‘సింహా’ లెజెండ్ లాంటివి ఇచ్చారు. జనరేషన్‌ మారితే మనుషులు . టెక్నాలజీ మారుతుంది.. కానీ, బాలయ్య బాబు ఎనర్జీ మారదు.ఆయన రాకతో మా సినిమా కలెక్షన్స్‌ కూడా అన్‌స్టాపబుల్‌ కావాలని కోరుకుంటున్నా’’ అని బాలయ్యను ఉద్దేశించి మాట్లాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *