సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నేడు, బుధవారం ఉదయం హైదరాబాద్ లోని తన నివాసానికి చేరుకున్నారు. ఇటీవల ఎన్నికల పోలింగ్ ముగిసాక .. కొద్దీ రోజులు రాజకీయాలకు దూరంగా ప్రశాంతంగా గడపడానికి ఈ నెల 19 వ తేదీన విదేశాలకు పయనమైన చంద్రబాబు దంపతులు ఏఏ దేశాలలో పర్యటించారో గోప్యం పాటించారు. అయితే నేడు విదేశీ పర్యటనను ముగించుకుని శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చారు. ఈ సందర్భముగా తెలుగు రాష్ట్రాలకు చెందిన టీడీపీ నేతలు పలువురు ఆయనకు ఘన స్వాగతం పలికారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *