సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లో ఈఏపీసెట్‌ 2024 పరీక్ష ఫలితాలును జూన్‌ మొదటి వారంలో ఫలితాలు వెల్లడి చేయనున్నట్లు సమాచారం. ఈఏపీసెట్‌ ఫలితాలతో పాటు కౌన్సెలింగ్‌ తేదీలను కూడా అదేరోజు ప్రకటించనున్నారు. కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో మే 16 నుంచి 23 వరకు ఏపీ ఈఏపీసెట్‌ 2024 ప్రవేశ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన ప్రిలిమినరీ ఆన్సర్‌ కీ, రెస్పాన్స్‌ షీట్లను( కీ ) ఇప్పటికే వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచారు. ఈఏపీసెట్‌ పరీక్షలకు అన్ని విభాగాలకు కలిపి మొత్తం 3,62,851 మంది దరఖాస్తు చేసుకోగా, వీరిలో 3,39,139 మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరయ్యారు. ఇక ఈఏపీసెట్‌లో ఇంటర్మీడియట్‌ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇవ్వనున్నట్లు ఇప్పటికే ఉన్నత విద్యా మండలి స్పష్టం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *