సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సౌత్‌ సెంట్రల్‌ రైల్వే విజయ వాడ డివిజన్‌ పరిధిలోని గన్నవరం నుంచి నూజివీడు వరకు ఆధునీకరణ పనులలో భాగంగా 21.21 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఆటోమేటిక్‌ బ్లాక్‌ సిగ్నలింగ్‌ సిస్టమ్‌ ఆధునికీ కరణ పూర్తీ చేసారు. దీనికోసమే ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా మీదుగా విజయవాడ వరకు పలు రైళ్లు రద్దు చెయ్యడం జరిగింది. వాటిని ఇప్పుడు పునరుద్ధరించారు. విజయవాడ రైల్వే అధికారులు మాట్లాడుతూ.. గన్నవరం – నూజివీడు రైల్వే స్టేషన్ల మధ్యలో పెద్దవుటపల్లి, తేలప్రోలు రైల్వే స్టేషన్లు ఉన్నాయన్నారు. ప్రయాణికుల రక్షణ కోసం అధునాత ఆటోమేటిక్‌ బ్లాక్‌ సిగ్నలింగ్‌ సిస్టమ్‌ను ప్రారంభించినట్టు తెలిపారు.ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును విజయవాడ డివిజన్‌కు చెందిన గతి శక్తి బృందం 31.81 కోట్ల రూపాయలతో పెట్టుబడితో 12 నెలల్లో పనులు పూర్తి చేశారన్నారు. ఇక ఏబీఎస్‌ ఆపరేషన్‌ రైళ్ళు స్వయం చాలకంగా పనిచేయడానికి అనుమతిస్తుందన్నారు. భద్రత, వేగ సామర్థ్యాన్ని పెంచుతుందని తెలిపారు. ఈ ఆధునీకకరణ ఏబీఎస్‌ పనులు విజయవాడ డివిజన్‌ మొత్తంలో 58.91 కిలోమీటర్ల పొడవున అమర్చడం జరిగిందన్నారు. ఇటీవల నిడదవోలు – కొవ్వూరు మధ్య ఏర్పాటు చేసిన ఏబీఎస్‌తోనే రైళ్ళ రాకపోకలు గత ఏప్రిల్‌ నెల లోనే పూర్తీ చేశామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *