సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఒక్కప్పుడు హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగినపుడు ఆ ఎన్నికలలోసర్వే ప్రకటనలపై భగ్గుమన్న సిపిఐ నారాయణ టీఆరెస్ మేయర్ అభ్యర్థి గెలిస్తే తన 2 చెవులు కోసుకొంటానని సంచలన ప్రకటన చేసారు. తరువాత సీఎం కెసిఆర్ చెవులులేకుండా నారాయణను చూడలేమని వదిలెయ్యమని అనడం అందరికి తెలిసిందే..అలాగే బండ్ల గణేష్ 2018ఎన్నికలలో కాంగ్రెస్ గెలవకపోతే 7 ఓ క్లాక్ బ్లెడ్ తో గొంతు కోసుకొంటానని సవాల్ చెయ్యడం అందరికి తెలిసిందే.. ఇప్పుడు తాజగా.. ఎగ్జిట్ పోల్స్ అంచనాల ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ- టీడీపీ నేతల మధ్య డైలాగ్ వార్‌కు దారితీసింది. ఒకరికొకరు పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఏపీలో వైసీపీ మరోసారి అధికారం చేపడుతుందని ఆరా మస్తాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మస్తాన్ వ్యాఖ్యలఫై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుద్దా వెంకన్న భగ్గుమన్నారు. మస్తాన్ చేత సీఎం జగన్ తప్పుడు రిపోర్ చెప్పించారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి అధికారంలోకి వస్తోందని బుద్దా వెంకన్న ధీమా వ్యక్తం చేశారు. కూటమి అధికారంలోకి రాకుంటే నాలుక కోసుకుంటానని ఛాలెంజ్ చేశారు. దీనికి అటువైపు నుండి మస్తాన్ కూడా వైసీపీ ఓడిపోతే ఆయన నాలుక కోసుకొంటారా? అంటూ విచిత్ర కోరిక కోరారు. ఏది ఏమైనా కూటమి గెలుపు ఖాయం అని టీడీపీ అభిమానులు ఎవరు ఈ స్వర్వే నమ్మకండి అని విజ్ఞప్తి చేసారు.
