సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: టీడీపీ అధినేత నారా చంద్రబాబు అమెరికా నుంచి వచ్చింది మొదలుకుని హైదరాబాద్ లో తన నివాసంలో ఏపీ లో కీలక నేతలతో కౌంటింగ్ రోజు ఎలా అప్రమత్తంగా ఉండాలి..? అని పార్టీ వరుస సమావేశాలతో టెలి కాన్ఫరెన్స్ లతో బిజిబిజీగా ఉన్నారు. ఎన్నికల పోలింగ్ ముగిశాక నేడు సోమవారం నాడు తొలిసారి ఏపీలోని మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయానికి వచ్చారు. చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన నేతలు, టీడీపీ శ్రేణులు ‘జై సీబీఎన్ .. జైజై సీబీఎన్.. సీఎం చంద్రబాబు..’ అంటూ కార్యకర్తలు, అభిమానులు, నేతలు నినాదాలతో హోరెత్తించారు. దానితో చంద్రబాబు వారినుద్దేశించి మాట్లాడుతూ.. ‘సంబరాలు రేపు .. రేపటి వరకు ఎనర్జీని వృథా చేసుకోకండి’ అని పార్టీ శ్రేణులతో చమత్కరించారు. ఈ సందర్భంగా కొందరు నేతలు.. ‘కాబోయే సీఎం మీరే సార్’ అంటూ ముందస్తు శుభాకాంక్షలు కూడా చెప్పారు. ఈ ఎగ్జిట్ ఫలితాలన్నీ అక్షరాలా నిజమవుతాయా..? వాటిలో వాస్తవాలు అసలు ప్రజా తీర్పు తెలియాలి అంటే.. తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడక తప్పదు మరి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *