సిగ్మాతెలుగు డాట్,ఇన్ న్యూస్: భీమవరంలోని 24వ వార్డు రామాయణం తోట, తాడేరు రోడ్డులోని టిడ్కో హౌస్, 39వ వార్డు దుర్గాపురం వాటర్ ట్యాంక్ వద్ద శ్రీమావుళ్ళమ్మ అమ్మవారి జాతర మహోత్సవాన్ని నేడు, ఆదివారం ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. అమ్మవారికి హారతులు ఇచ్చి జాతరను ప్రారంభించి మాట్లాడారు. ప్రతి ఏడాది సాంప్రదాయంగా అమ్మవారి జాతర వేడుకలను నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రతిఒక్కరీలో దైవభక్తి ఆధ్యాత్మిక చింతన ఉండాలని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. అనంతరం శక్తి వేషాధారణలు, డప్పుల వాయిద్యాలతో గరగల నృత్యాలతో ప్రత్యేకంగా అలంకరణ చేసిన వాహనంపై అమ్మవారిని ఊరేగించారు. కార్యక్రమంలో ఆయా వార్డుల కమిటి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
