సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశంలో లోక్ సభ ఫలితాలలో ఎన్డీయే కూటమితో నువ్వా నేనా అంటూ ఫలితాలు సాధించిన సోనియా గాంధీ సారధ్యంలోని ఇండియా కూటమి కూడా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు గల అవకాశాలను పరిశీలించేందుకు ‘ఇండియా’ (INDIA) కూటమి నేతలు నేడు, బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో సమావేశమయ్యారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్, జేఎఎం ఎమ్మెల్యే కల్పనా సోరెన్ తదితరులు హాజరయ్యారు.కాగా, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాకరే, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) సుప్రీం మమతా బెనర్జీ ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు. అయితే ఉద్ధవ్ థాకరే తరఫున సంజయ్ రౌత్, టీఎంసీ తరఫున అభిషేక్ బెనర్జీ ‘ఇండియా’ కూటమి సమావేశానికి హాజరయ్యారు. . రాహుల్ గాంధీ ప్రధానమంత్రి పదవిని చేపట్టేందుకు అంగీకరిస్తే తాము మద్దతు ప్రకటిస్తామని దానిపై కూటమి నేతల్లో ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేకుండా ఏకతాటిపైకి వచ్చేందుకు సంసిద్దమోతున్నట్లు సమాచారం.. ఇదే జరిగితే బలపరీక్ష తప్పదు.. దానిలో ఎన్డీయే టెంక్షన్ ఎదురుకొనే పరిస్థితి తప్పకుండ ఉంది..
