సిగ్మా తెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు కోటికలపూడి గోవిందరావు ని వారి ఇంటి వద్ద నేడు, శుక్రవారం ఉదయం తాడేపల్లి గూడెం నుండి జనసేన ఎమ్మెల్యే గా భారీ మెజారిటీ తో గెలుపొందిన బొలిశెట్టి శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిశారు. బొలిశెట్టి కి చినబాబు సాళువ కప్పి అభినందించారు.. బొలిశెట్టి మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో దశాబ్ద కాలంగా పనిచేసినందుకు రాష్ట్రంలో చీకటి రోజులను తొలగించేందుకు ప్రజలు తమకు పట్టం కట్టారని వారి ఆశయ సాధనకు తాము కట్టుబడి పనిచేస్తామని , తాడేపల్లి గూడెం ను అభివృద్ధి పధంలో నిలబెడతానని తమకు జిల్లా పార్టీ అధినేతగా సహకరించిన చినబాబు కు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *