సిగ్మా తెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయంలో రేపటి శనివారం జూన్ 8వ తేదీ నుండి శ్రీ అమ్మవారి జేష్ఠమాస జాతర ప్రారంభిస్తున్నారు. ఈ జాతర ను వచ్చే జులై నెల 5వ తేదీ శుక్రవారం వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలియజేసారు. ఈనేపథ్యంలో శ్రీ అమ్మవారి వెండి ఘట్టాలతో ఇంటింటికి వచ్చి శ్రీ మావుళ్ళమ్మవారి అస్సిసులు అందజేశారు. మహిళలకు పసుపు కుంకుమ అందజేస్తారు. ఈనెల 27వ తేదీన గురువారం మధ్యాహ్నం ఆలయం నుండి శ్రీ అమ్మవారి నగరోత్సవం నిర్వహించి తదుపరి సాయంతం కళాకారులతో జాతర మహోత్సవం రాత్రి వరకు ఘనంగా నిర్వహిస్తారు.
