సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల కాలంలో సరైన హిట్ లేక వెనుకబడిన నటుడు శర్వానంద్ కి ఎప్పుడో 5 ఏళ్ళ క్రితం ‘శతమానం భవతి తరువాత ‘ఒక పెద్ద హిట్ సినిమా లేకపోయింది. అతని సినిమా వచ్చి 2 ఏళ్ళ తరువాత నేడు, శుక్రవారం మనమే‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు, కృతి శెట్టి కథానాయిక. ఇందులో శివ కందుకూరి ఒక ప్రత్యేక పాత్రలో కనపడతాడు. హేషం అబ్దుల్ వహాబ్ సంగీతం సమకూర్చారు. సినిమా కధ విషయానికి వస్తే.. విక్రమ్ (శర్వానంద్) అల్లరి చిల్లరిగా తిరుగుతూ వుండే అబ్బాయి. ఒకరోజు అతని స్నేహితుడు అనురాగ్ (ఆదిత్ అరుణ్), భార్య ఇద్దరూ హైదరాబాదులోని ఒక ప్రమాదంలో చనిపోతారు అని తెలుస్తుంది. వారి రెండేళ్ల పిల్లవాడు ఖుషి మాత్రం ప్రమాదం నుండి బయటపడతాడు. ఆ పిల్లవాడికి బ్రిటిష్ పౌరసత్వం ఉండటంతో ఆ చిన్న పిల్లాడిని అనాధగా వదలడం ఇష్టంలేక, చూసుకునేందుకు విక్రమ్, సుభద్ర (కృతి శెట్టి) లు ముందుకు వచ్చి భార్య భర్తలుగా లండన్ వెళతాం అని చెప్తారు. లండన్ లో వీళ్ళిద్దరూ ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? లండన్ లో రాహుల్ రవీంద్రన్ ఏమి చేస్తున్నాడు, అతను ఎందుకు పిల్లవాడైన ఖుషీని చంపాలని ప్రయత్నం చేస్తాడు? ఇవన్నీ తెలియాలంటే ‘మనమే’ సినిమా చూడాల్సిందే. సినిమా అయితే మొత్తం ట్విస్ట్ ఆఖరి 15 నిమిషాలలోనే ఉంటుంది. విదేశీ అందాలు మాత్రం చాల బాగా కవర్ చేసారు. హీరో హీరోయిన్స్ మధ్య కెమిస్ట్రీ అంతగా లేదు. చిన్న బాబు చుట్టూ కధ తిరుగుతున్నప్పటికీ భావోద్వేగాలు కావలసినంత పండించలేకపోయారు. ఒకసారి చూసేయ్యచు.
