సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రామోజీరావు నివాళిగా 2 రోజుల పాటు ఏపీ ప్రభుత్వం సంతాప దినాలు ప్రకటించింది. ఈ నెల 9, 10 తేదీలను సంతాప దినాలుగా ప్రకటిస్తూ సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల పాటు జాతీయ పతాకాన్ని సగం వరకూ అవనతం చేయాలని సూచిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రేపు ఆదివారం రామోజీ ఫిలిం సిటీ లో అత్యంక్రియలు నిర్వహిస్తారు, రామోజీ భౌతిక కాయాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలసి దర్శించుకున్న పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. .రామోజీరావు మృతి దిగ్ర్భాంతి కలిగించింది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడున్న ఏ జర్నలిస్ట్‌కు అయినా ఈనాడు రూట్స్ ఉంటాయి. అలా వేలాది మంది జర్నలిస్టులను రామోజీరావు అందించారు. సినీ ఇండస్ట్రీకి కూడా ఆయన ఎంతో చేశారు. రామోజీరావును గత కొన్నేళ్లుగా ప్రభుత్వాలు చాలా ఇబ్బంది పెట్టాయి.. వాటన్నింటినీ ఈ వయసులో కూడా తట్టుకున్నారు. ఇబ్బంది పెట్టిన ప్రభుత్వాలు ఈ రోజు లేవు. ఇదే విషయాన్ని రామోజీరావుకు చెప్పాలని అనుకున్నాను. ప్రమాణస్వీకారం తర్వాత వచ్చి కలుద్దామనుకున్నాను. దురదృష్ణం ఇంతలోనే ఇలా జరిగిపోయింది. ఆయన కుటుంబానికి జనసేన తరపున సంతాపం తెలియజేస్తున్నాను’ అని పవన్ కల్యాణ్ విచారం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *