సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పెరిగే వయస్సు తో పాటు సినీ హీరోగా ఇమేజ్ అభిమానులను పెంచుకొంటూ ముచ్చటగా 3వసారి హిందూపురం ఎమ్మెల్యే గా గెలిచిన నందమూరి బాలకృష్ణకు చంద్రబాబు నాయుడు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బాలయ్య ఆయురారోగ్యాలతో ఉండాలని పూజలు చేపడుతున్నారు. ఉండి ఎమ్మెల్యే రఘురామా కృష్ణంరాజు బాలయ్య తో తన అనుబంధాన్ని గుర్తుచేస్తూ కొన్ని ఫోటోలు షేర్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
