సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మరఠ్వాడా ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. .దీని ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ లో రేపు మంగళవారం రోజు అల్లూరి సీతారామరాజు, కృష్ణా, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య,చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. బుధవారం రోజు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
