సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ ఈఏపీసెట్ (AP EAP CET) ఫలితాలు నేడు, మంగళవారం సాయంత్రం విడుదలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3.39 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ జే.శ్యామల రావు ఫలితాలను విడుదల చేశారు. ఇంజనీరింగ్‌లో 1,95,092 మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఇంజనీరింగ్‌లో 75.51 శాతం ఉత్తీర్ణత సాధించారు. అగ్రికల్చరల్ ఇంజనీరింగ్‌లో అర్హతసాధించిన 70,352 మంది విద్యార్థులు క్వాలిఫై అయ్యారు. అగ్రికల్చరల్ ఇంజనీరింగ్‌లో 87.11 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంజనీరింగ్‌లో ర్యాంకులలో మాకినేని జిష్ణు సాయి ఫస్ట్ ర్యాంకు, మురసాని సాయి యశ్వంత్ రెడ్డికి రెండవ ర్యాంకు, భోగలాపల్లి సందీష్‌కి మూడవ ర్యాంకు వచ్చాయి. ఇక అగ్రికల్చర్‌లో ఫస్ట్ ర్యాంక్ యెల్లు శ్రీశాంత్ రెడ్డి (తెలంగాణ), అగ్రికల్చర్‌లో రెండవ ర్యాంక్ పూల దివ్యతేజ, అగ్రికల్చర్‌లో మూడవ ర్యాంక్ వడ్లపూడి ముకేష్ చౌదరిలకు వచ్చాయి.ఈఏపీసెట్‌లో ఇంటర్‌ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చి ర్యాంకులను నిర్ణయించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *