సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో సాధారణంగా ముఖ్యమంత్రి ఫోటోలను ఏర్పాటు చేస్తుంటారు. కానీ రాష్ట్రంలో ఇకపై సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్ చిత్రపటాలను కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు నేడు, శనివారం ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఐ అండ్ పిఆర్ అధికారులకు సూచనలు చేశారు. తాజా నిర్ణయంతో ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సీఎం చంద్రబాబు తోపాటు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలు ఉండనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *