సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, మంగళవారం సచివాలయంలో తన క్యాబిన్ లోకి అడుగుపెట్టి పదవి బాధ్యతలు స్వీకరించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రెండో బ్లాక్ లోని మొదటి అంతస్తులో 212 నెంబర్ పేషీ ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసిన పవన్ తదుపరి , జనసేన మంత్రులు దుర్గేష్, నాదెండ్ల తో కలసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబుని ఆయన ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిశారు..(ఫై ఫొటోలో ) కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి సెక్రటేరియట్ లోని తన ఛాంబర్ కు వచ్చిన పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి ఆలింగనం చేసుకుని స్వాగతం పలికారు. ఇదిలా ఉండగా ఇక తాజగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ . ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మధ్య చాంబర్ల విషయంలో వివాదం తలెత్తిందని ముందుగా 212, 214 చాంబర్లు పవన్‌కు కేటాయించగా ఆ తర్వాత ఆ ఛాంబర్ ఆర్థిక మంత్రి కావాలని అడగడంతో ఆయనకు ఇచ్చారని.. పవన్‌కు మరల 211 పేషీ కేటాయించినట్లు వార్తలు రావడంపై .. ఈ వ్యవహారంపై పయ్యావుల కేశవ్ మీడియా తో మాట్లాడుతూ.. ‘పేషీల గురించి నేను ఎవరితో మాట్లాడలేదు. నాకు ఇది కావాలని ఎవరినీ అడగలేదు.ఏది కేటాయిస్తే అది తీసుకుంటాను. పవన్ కల్యాణ్ పేషీ గురించి వస్తోన్న వార్తల్లో నిజం లేదు. పవన్ కల్యాణ్ సెక్రటేరియట్‌లో ఏ బ్లాక్ కావాలంటే అది తీసుకోవచ్చు.కొందరు కావాలనే అసత్యాలు ప్రచారం చేస్తున్నారు’ అని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు.
