సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు ఆలస్యంగా రావడం.. గత జగన్ సర్కార్ పతనం కావడానికి ప్రధాన కారణం అయ్యింది. గతంలో ప్రతి నెల ఒకటో తేదీ నుండి దాదాపు 2వారలు పాటు ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు జీతాల కోసం పడిగాపులు కాసేవారు. అయితే కొత్తగా వచ్చిన సీఎం చంద్రబాబు ప్రభుత్వం ఏపీ ఉద్యోగులకు ఉపశమనం కల్పించారు. ఎన్నికల సమయంలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలులో భాగంగా 1న తారీఖున జీతాలు పడతాయా? లేదా? అనే సందేహాలన్నింటికి కూడా సీఎం చెక్ పెట్టేశారు. నేడు సోమవారం పేదలకు పింఛన్ లతో పాటు సరిగ్గా ఒకటో తేదీనే (జులై 1) ఉద్యోగుల అందరి ఖాతాల్లోకి జీతాలు జామా చెయ్యడం మరో విశేషం.. మొత్తానికి చంద్రబాబు పాలనలో ఈ మొదటి నెల మాట నిలబెట్టుకొన్నారు. నేటి మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉద్యోగుల అకౌంట్లలో జీతాలు జమ అవుతున్నాయి. రిజర్వ్ బ్యాంకు నుంచి బ్యాచ్ నెంబర్ల వారీగా జీతాలు పడుతుండటంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తూ ఇదే విధానం ఇక ముందు కొనసాగాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల కోసం రూ.5500 కోట్ల రూపాయలు నిధులు ఒక్క రోజులో విడుదల అయ్యాయని సమాచారం.
