సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నిన్నటి వరకు రికార్డు స్థాయిలో లాభాలతో దూసుకొని పోయిన దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు, శుక్రవారం వారాంతంలో (జులై 5న) భారీ నష్టాలతో కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో సెన్సెక్స్(sensex), నిఫ్టీ(nifty) సూచీలతోపాటు బ్యాంక్ నిఫ్టీ కూడా ఒత్తిడిలో కనిపించింది. ఈ నేపథ్యంలో సెన్సెక్స్ ఉదయం 10.40 నిమిషాల నాటికి 319 పాయింట్లు పడిపోయి 79,731 పరిధిలో ఉంది. మరోవైపు నిఫ్టీ 63 పాయింట్లు పతనమై 24,239 స్థాయిలో ఉంది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ 593 పాయింట్లు పతనమై 52,511 పరిధిలో ఉంది. ఐటీ, ఫార్మా షేర్లలో పెరుగుదల కనిపించినా బ్యాంకింగ్ షేర్లలో మాత్రం తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఈ క్రమంలో HDFC బ్యాంక్, M&M, టైటాన్ కంపెనీ, టాటా స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీల స్టాక్స్ టాప్ 5 నష్టాల్లో ఉండగా, దివిస్ ల్యాబ్స్, ONGC, సిప్లా, లార్సెన్, రిలయన్స్ సంస్థల స్టాక్స్ టాప్ 5 లాభాల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో మదుపర్లు దాదాపు 3 లక్షల కోట్లకుపైగా నష్టపోయినట్లు తెలుస్తోంది. గ్లోబల్ మార్కెట్ నుంచి మిశ్రమ సంకేతాల నేపథ్యంలో భారతీయ స్టాక్ మార్కెట్ ఈరోజు నష్టాల్లో కొనసాగుతోంది. మరోవైపు ఆసియా మార్కెట్లు కూడా నష్టాల్లోనే ఉన్నాయి.
