సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్రంలో టీడీపీ గెలుచుకున్న ఒక్క తాడిపత్రి మినహా అన్ని మునిసిపాలిటీలు , నగర కార్పొరేషన్స్, జిల్లా జడ్పీటీసీ చైర్మన్ పదవులు ఎన్నికలలో ప్రజాక్షేత్రంలో వార్ వన్ సైడ్ తరహాలో గతంలో వైసీపీ హస్తగతం చేస్తుకోవడం దేశ చరిత్రలో రికార్డు గా నిలచించింది. మరి ఇప్పుడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాష్ట్రంలో వైజాగ్, కాకినాడ, ఏలూరు వంటి పలు నగరాలలో కార్పొరేటర్లు ను చేజికించుకొనే పనిలో టీడీపీ , జనసేన పెద్దలు చేస్తున్న కసరత్తులు కొలిక్కి వస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలలో ఘోర ఓటమితో వైసీపీ లో అసంతృప్తులు కూడా ‘అధికారం’ కోసం కూటమి గొడుగు క్రిందకు వచ్చేయడానికి సన్నాహాలు చేసుకొంటున్నారు. దీనిలో భాగంగా వైసీపీకి పెద్ద షాక్ సీఎం చంద్రబాబు స్వంత జిల్లాలో పడింది. చిత్తూరులో నగర పాలన కూటమి పార్టీల చేతికి దక్కింది. వైసీపీకి చెందిన మేయర్ అముద,( ఈమె గతంలో నిరుపేద.. కట్టెలు కొట్టి జీవించే మహిళ ను జగన్ కార్పొరేషన్ మేయర్ చేసారు) డిప్యూటీ మేయర్ రాజేశ్ కుమార్‌రెడ్డి సహా 18 మంది కార్పొరేటర్లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. గత శుక్రవారం చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ సమక్షంలో టీడీపీ కండువా కప్పుకొన్నారు. కొన్నాళ్ల కిందట నలుగురు కార్పొరేటర్లు జనసేనలో చేరారు. దీంతో చిత్తూరు మునిసిపల్ కార్పొరేషన్ పాలన కూటమి చేతికి వచ్చింది. చిత్తూరు నగరపాలక సంస్థలో మొత్తం 50 డివిజన్లు ఉన్నాయి. 47 చోట్ల వైసీపీ కార్పొరేటర్లు గెలువగా కేవలం 3 చోట్ల టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. తాజాగా మేయర్, డిప్యూటీ మేయర్ సహా 18 మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరడంతో కార్పొరేషన్‌లో ఆ పార్టీ సభ్యుల సంఖ్య 21కి చేరింది. జనసేనలో చేరిన నలుగురు కార్పొరేటర్లను కలుపుకొంటే కూటమికి 25 మంది సభ్యులు ఉన్నట్టయింది. ఇక, చిత్తూరు, పూతలపట్టు ఎమ్మెల్యేలు గురజాల జగన్మోహన్, మురళీమోహన్ ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఉన్నారు. దీంతో చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్‌లో కూటమికి ఆధిక్యత వచ్చింది.
