సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు రాష్ట్రాలలో ప్రెవేటు రంగంలో మొదటి మహిళా విశ్వ విద్యాలయంగా ఇటీవల ఏపీ ప్రభుత్వ ఆమోదం పొందిన భీమవరం విష్ణు మహిళా ఇంజినీరింగ్ కళాశాల చరిత్ర సృష్టించింది. శ్రీ విఘ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో 2001 సంవత్సరంలో స్థాపించబడిన శ్రీ విష్ణు మహిళా ఇంజినీరింగ్ కళాశాల, భీమవరం, నేడు విద్యా రంగంలో 25 సంవత్సరాల సువర్ణ ప్రస్థానాన్ని విజయవంతంగా పూర్తి చేసుకొని మహిళా సాంకేతిక విద్యలో రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచింది. కేవలం మూడు బి.టెక్. కోర్సులు, 180 మంది విద్యార్థుల ప్రవేశ సామర్థ్యంతో 2001 లో ప్రారంభమైన ఈ విద్యాసంస్థ, నేడు 9 బి.టెక్. కోం కోర్సులు, 4 ఎం.టెక్ కోర్సులు, ఎం.బి.ఏ. కోర్సు నిర్వహిస్తూ 1,074 మంది ప్రవేశ సామర్ధ్యాన్ని కలిగియుండి, నేడు 5000 మంది విద్యార్థుల సంఖ్యాబలాన్ని కలిగి తెలుగు రాష్ట్రాలలోనే టాప్ గ్రేడ్ ప్రముఖ విద్యాసంస్థగా అభివృద్ధి చెందింది. ఆధునిక సదుపాయాలు తో పకృతి ఒడిలో అందమైన ఉద్యానవనాలుతో ఈ మహోన్నత విద్యాసంస్థ స్థాపకులు స్వర్గీయ డా. బి. వి. రాజు గారు, మహిళా విద్యే సమాజాభివృద్ధికి పునాది అని భావించారు. పరీక్షా ఫలితాలలో ఎల్లప్పుడూ అగ్రశ్రేణి కళాశాలల్లో ఒకటిగా నిలుస్తూ, అత్యుత్తమ క్యాంపస్ ప్లేస్మెంట్ రికార్డుతో వేలాది మంది విద్యార్థినులకు దేశ, విదేశాల్లోని ప్రముఖ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలను కల్పించింది. అందువలే ఇంజినీరింగ్ విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థినులుకు మొదటి ప్రాధాన్యంగా ఎంపిక చేసుకునే కళాశాలగా నిలిచింది. నేడు వేలాది విద్యార్థినుల జీవితాల్లో ఉన్నత భవిషత్తు వెలుగులు నింపుతోంది. ఇప్పడు దేశంలో 3వ మహిళా యూనివర్సిటీ గా జాతీయ స్థాయిలో భీమవరం పట్టణానికి ప్రముఖ విద్యామకుటం నిలువనున్నది.
