సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో రామాలయ నిర్మాణానికి దేశ అత్యున్నత నాయస్థానం సుప్రీంకోర్టు ఆమోదముద్ర వేసింది. ఈ తీర్పు ఫై హర్షం వ్యక్తం చేసిన ఏపీ అసెంబ్లీ ఉప సభాపతి రఘురామా కృష్ణంరాజు నేడు, సోమవారం భీమవరం శివారులోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఆకివీడు ఆలయ పునర్ నిర్మాణాన్ని సవాలు చేస్తూ జడ శ్రవణ్ కుమార్ వేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ తాజాగా సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది...ఈ వివాదానికి సంబంధించి గతంలో జిల్లా కలెక్టర్ జారీ చేసిన నిరభ్యంతర పత్రం (NOC) చట్టబద్ధమైనదేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ స్థలంలో నిబంధనలకు లోబడి ఆలయ నిర్మాణం చేపట్టడంలో ఎలాంటి తప్పులేదని వ్యాఖ్యానించింది. దీనిపై రామాలయ నిర్మాణానికి అనుకూలంగా గతంలో హైకోర్టు ఇచ్చిన 3 కేసులలో ఇచ్చిన తీర్పులను సుప్రీం కోర్ట్ సమర్ధించింది. కాబట్టి రాములోరు విజయం సాధించారు. అన్ని అనుకున్నట్లే.. తాను గతంలో హామీ ఇచ్చినట్లే నవంబర్ లోగ సర్వ సుందరంగంగా శ్రీ రాములోరి ఆలయం పూర్తీ చేస్తామని ప్రకటించారు. జడ శ్రవణ్ కుమార్ గారు కూడా పరమత సహనంతో ఇకపై ఈ అంశం ఫై కోర్ట్ కు వెళ్లకుండా సహకరించాలని విజ్ఞప్తి చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *