సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో నేటి సోమవారం మధ్యాహ్నం రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ఇసుక పాలసీపై జీవో విడుదల చేసారు. . రాష్ట్రంలో గత ప్రభుత్వ పాత ఇసుక విధానాన్ని రద్దు చేస్తూ సర్కార్ ఉత్తర్వులు ఇచ్చింది. దీనివల్ల ఏడాదికి వచ్చే సుమారు 4వేల కోట్ల పైగా వచ్చే ప్రభుత్వ ఆదాయానికి గండి పడనుంది. 2024 ఇసుక విధానం రూప కల్పన వరకూ సరఫరాకు మార్గదర్శకాలు జారీ చేసింది. కొత్త ఇసుక విధానాన్ని తెచ్చే వరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి వరకు వినియోగదారుడికి ఉచితంగా ఇసుక ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జీవో నంబర్ 43ను జారీ చేసింది. వినియోగదారుడు ఎత్తుడు, దించుడు కూలీతో ఇతర చట్టబద్ధమైన పన్నులు చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల్లో పేర్కొంది.కాగా.. నేటి నుంచి ఉచిత ఇసుక పాలసీ అమలులోకి వస్తుందని ప్రచారంతో నేటి ఉదయం నుంచే స్టాక్ పాయింట్స్ వద్ద వాహనాలు బారులు తీరాయి. అయితే ఉదయం ఇసుక పాలసీపై ప్రభుత్వం నుంచి జీవో ఇంకా విడుదల కాకపోవడంతో అధికారులు ఎదురు చూపులు చూశారు.దీంతో తర్జనలు భర్జనలు తరువాత మధ్యాహ్నానికి ఉచిత ఇసుక పాలసీపై ప్రభుత్వం జీవోను విడుదల చేసింది. పైకి ఉచితంగా ప్రకటనలకే పరిమితం కాకుండా కూటమి ప్రభుత్వం నిర్దిష్ట పనితీరు కనపరిస్తే.కొందరు ఎమ్మెల్యేలు, అధికారులు, మధ్యవర్తల దందా పూర్తిగా తొలగిస్తేనే సామాన్యునికి ఉచిత ఇసుక ఫలితాలు అందుతాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వ Online తొందరపాటు నిర్ణయాలుతో పాటు అనుకోని సమస్య కరోనా వచ్చిన తరువాత పూర్తిగా కుదేలు అయిన అపార్ట్మెంట్స్ నిర్మాణాలు, రియల్ ఎస్టేట్ నిర్మాణాలు ఇక ఉపందుకొంటాయని కోరుకొందాం. దీనితో కార్మికులకు ఇంజనీర్స్ కు పని దొరుకుతుందని ఆర్థిక లావాదేవీలు పెరుగుతాయని భావించవచ్చు..
