సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం ప్రభావంతో గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు నేడు, శుక్రవారం కూడా అదే రీతిన కొనసాగుతుంది. జిల్లాలో జనజీవనం స్తంభించింది. సుమారు 2 వేల పైగా ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి.నిన్నటి గురువారం వరకు జిల్లాలో భారీ వర్షాలకు 831.2 వర్ష పాతం నమోదు అయ్యింది. మండలాల వారీగా అత్యధికంగా తాడేపల్లిగూడెం లో అత్యధికంగా 95.8 మి.మీ వర్షం కురిసింది. భీమవరంలో 50.4, మి.మీ వర్షం కురవగా, పాలకోడేరులో 45.2, వీరవాసరంలో 31.4, నరసాపురంలో 54.6, పాలకొల్లులో 62.2 మి.మీ వర్షపార్ష త నమోదైం ది. ఉండిలో 48.2, మీ.మీ వర్షం కురిసింది. పొలాల్లోని ముంపు నీరు బయటకు పోయేందుకు రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయా ధికారులు సూచిస్తున్నారు. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని లోతట్టు ప్రాంతాలు, శిథిలావస్థలోస్థ ఉన్న భవనాలు,గుడిసెలు, షెడ్లలోడ్ల నివసిస్తున్న ప్రజలు తక్షణమే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున శానిటేషన్, బ్లీచింగ్, శుద్ధి చేసిన తాగునీటి సరఫరాకు మున్సిపల్, ఆరోగ్యశాఖ, అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు కాలువ గట్లు, డ్రెయిన్లు, గోదావరి గట్లను,భీమవరం లోని యనమదురు కాలువ, పర్యవేక్షించాలని, గండ్లు పడే అవకాశం ఉంటే ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *