సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో వాహనాల ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు, తాడేపల్లి గూడెం వైపు రైల్వే గేటు పడకుండా ప్రతి రోజు వేలాది వాహనాలు వేగంగా వెళ్ళడానికి గత 2 ఏళ్ళ క్రితం ప్రధాన సెంటర్ అంబెడ్కర్ సెంటర్ నుండి విజయలక్ష్మి థియేటర్స్ వరకు రైల్వే శాఖ నిధులతో సుమారు 20 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆధునిక అండర్ టర్నల్ ఇటీవల గత కొంత కాలంగా స్థానిక మునిసిపల్ శాఖ నిర్వహణ లోపంతో సతమతమౌతుంది. ఎదో మంత్రులు , ప్రముఖులు వచ్చినప్పుడు మినహా శుభ్రం చెయ్యడం మినహా పట్టించుకొనే నాధుడు కనపడటం లేదు. గతంలో వర్షపు నీరు చేరిన, లేదా డ్రైన్స్ వాటర్ చేరిన ఒకరోజు అటు ఇటో దానిని తొలగించేవారు.. ఇటీవల నీటిని మోటారు తో తోడటం ఫై శ్రద్ద వహించడం లేదు. . ఇటీవల వరుసగా కురుస్తున్న భారీ వర్షాలకు భారీగా చేరిన నీటితో టర్నల్ మధ్యకు రాగానే అక్కడ సుమారు 40 అడుగుల దూరంవరకు 2లేదా 3 అడుగులతో నీటి మడుగును తలపిస్తుంది. ( ఫై తాజా చిత్రంలో చూడవచ్చు) అక్కడ 2 వీలర్స్ వాహనాలు నడపాలంటే చాల ఇబ్బంది. నీటిలో మునిగి 2 వీలర్స్ వాహనాలు రిపేర్ వస్తుంటే.. 4 వీలర్ వాహనాలు కు సైతం ప్రమాదాలు జరుగుతున్నాయి. అందరు బురద అంటించుకోక తప్పదు. ఇక మన ప్రక్క వేగంగా ఆటోలు వచ్చాయంటే ఇక అంతే సంగతులు.. ఇప్పటికైనా అధికారులు శ్రద్ద పెట్టి ఈ వర్షాకాలంలో ఎప్పటికప్పుడు నీటిని తోడిస్తే మంచిది. అండర్ టర్నల్ ప్రారంభ తొలినాళ్లలో ఆటోమేటిక్ సెన్సార్ లను ఏర్పాటు చేసి నీరు చేరగానే ఎప్పటికప్పుడు నీటిని తోడేస్తామని ఆనాటి అధికారులు, నిర్వాహకులు అన్నారు. మరి ప్రజా ప్రతినిధులు అధికారులు మరోసారి ప్రయత్నిస్తే .. శాశ్వత పరిష్కారం లభిస్తుంది.
