సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మున్సిపల్ కమిషనర్ ఎం.శ్యామల ఆధ్వర్యంలో నేడు, శుక్రవారం స్థానిక భీమవరం పురపాల సంఘం నందు ఇంజనీరింగ్ సిబ్బంది మరియు శానిటేషన్ సిబ్బంది వారితో సమావేశం జరిగింది ఈ సమావేశం అధికారులు పారిశుధ్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించనని ..ఎప్పటికప్పుడు ముంపు ప్రాంతాల్లో వాటర్ ను తోడించడం అదేవిధంగా డ్రైనేజీలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా డీసిల్టేషన్ చేయడం సంబంధిత అంశాలపై కమీషనర్ హెచ్చరికలు చేసి సంబంధిత సిబ్బందికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా అల్పపీడన ద్రోణి తో భారీ వర్షాల నేపథ్యంలో ..రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయడం వల్ల సంబంధిత ఇంజనీరింగ్ సెక్షన్ వారిని అలర్ట్ గా ఉండి ఎప్పటికప్పుడు ముంపు ప్రాంతాలను సమీక్ష చేసి వాటర్లను ఇంజన్ ద్వారా తోడించి కార్యక్రమం చేపట్టమని ఆదేశించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీర్ త్రినాధరావు మరియు అందరూ dee లు ఏఈలు సిబ్బంది పాల్గొన్నారు
