సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వినుకొండ చేరుకొనేదశలో అడుగడుగునా భారీ వైసీపీ సందోహం మధ్యన నేడు, శుక్రవారం వైసీపీ అధినేత జగన్ భారీ కాన్వాయ్ తో వెళ్లి ఇటీవల హత్య కు గురైన రషీద్ కుటుంబసభ్యులను ఓదార్చారు. అన్ని రకాలుగా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. .తదుపరి బయటకు వచ్చి మీడియా తో మాట్లాడుతూ.. నడి రోడ్డుపై వైసీపీ నేత రషీద్ పాశవిక హత్యను చూసి దేశం యావత్తు చలించింది. రషీద్ హత్యలో టీడీపీ నేత జిలాన్ అనే ఒక్కడి పైనే కేసు పెట్టడం ఏంటి..? లోకల్ ఎమ్మెల్యేపై ఎందుకు కేసు పెట్టడం లేదు?” అని జగన్ ప్రశ్నించారు. 45 రోజుల కూటమి పాలనలో 36 రాజకీయ హత్యలు జరిగాయి. 300 పైగా హత్యాయత్నాలు జరిగాయి. టీడీపీ వేధింపులు భరించలేక 35 మంది ఆత్మహత్య చేసుకున్నారు. 560 చోట్ల ప్రైవేటు ఆస్తులను, 490 చోట్ల ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. వెయ్యికి పైగా దాడులు, దౌర్జన్యాలు చోటు చేసుకున్నాయి” టీడీపీ నేతలు ఎన్ని దాడులు చేస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని, తిరిగి వైసీపీ వాళ్లపై కేసులు పెడుతున్నారని జగన్ ఆరోపించారు.అని జగన్ ఆరోపించారు. వైసీపీ కార్యకర్తలపై వరుస దాడుల నేపథ్యంలో వచ్చే బుధవారం దేశ రాజధాని ఢిల్లీలో ధర్నా చేయాలని నిర్ణయించారు. జగన్. ఏపీలో వైసీపీ కార్యకర్తలపై దాడులకు నిరసనగా ఈ ధర్నా చేపట్టనున్నారు. వైసీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలతో కలసి ధర్నాకు చేసి, అటు ప్రధాని మోడీ స్వయంగా కలసి ఏపీ లో అరాచకాన్ని దేశానికీ తెలియజేస్తామని అన్నారు. ఢిల్లీ లో జగన్ చెయ్యబోయే ధర్నా ఏపీలో చంద్రబాబు నేతృత్వంలో ఎన్డీయే పాలన కావడంతో ప్రతిపక్ష ఇండియా కూటమికి ప్రధాని మోడీ ని ఇరుకున పెట్టె అస్త్రం కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *