సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయు గుండం ప్రభావంతో కోస్తా తీరంలో సముద్రం అల్ల కల్లోలంగా మారింది.సుమారు 40 – 50కిలోమీటర్లు వేగంతో ఈదు రుగాలులకు కెరటాలు ఎగసిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో భీమవరం మండలం లోని సముద్ర తీరప్రాంతాలతో పాటు నరసాపురం మండలం చినలంక, పీఎం లంక, పేరుపాలెం, కేపీపాలెం వద్ద సముద్రం ఉధృతంగా కనిపిస్తోంది.4 రోజుల క్రితం అల్పపీడనం హెచ్చరికల తో మత్స్యశాఖ అధికారులు ఈనెల 22 వరకు వేట నిషేధ ఆజ్ఞలు జారీ చేశారు. ఇప్పటికే వేటకు వెళ్లిన బోట్లన్నీ తీరానికి చేరుకుంటున్నాయి.ఇంకా సముద్రంలో ఉన్న బోట్లను అధికారులు వెనక్కిరప్పిస్తున్నారు. వాతావరణ పరిస్థితులను బట్టి అవసరమైతే ఈ నెల 22 తరువాత కూడా సముద్రంలో మత్యకారుల వేట నిషేధం మరికొన్ని రోజులు పొడిగించే అవకాశం ఉంది.
