సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత శుక్రవారం రోజు మధ్యాహ్నం మైక్రోసాఫ్ట్‌ క్లౌడ్ (Microsoft Cloud) సేవల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో భారత్‌ తో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లోకంప్యూటర్ ఆన్ లైన్ సేవలకు మైక్రోసాఫ్ట్‌ వినియోగిస్తున్న ఎయిర్‌పోర్టులు, హెల్త్, స్టాక్‌ మార్కెట్, బ్యాంకింగ్‌, తదితర సేవలు స్తంభించిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా పలువురు వినియోదారులకు వారి సిస్టమ్స్‌, ల్యాప్‌టాప్‌లలో బ్లూ స్రీన్ ఆఫ్‌ డెత్‌ ఎర్రర్‌ కనిపించింది. దీంతో యూజర్లు తమ సమస్యలను ఎక్స్‌ వేదికగా తెలియజేశారు. అనేక మంది విమాన ప్రయాణాలు రద్దయ్యాయి. ఆన్ లైన్ సేవలు నిలచిపోయాయి. సంస్థలకు భారీ నష్టాలు వచ్చాయి. అయితే విండోస్‌లో తలెత్తిన సమస్యలపై మైక్రోసాఫ్ట్ వినియోగదారులకు క్షమాపణలు తెలియజేసింది. . మైక్రోసాఫ్ట్ 365 యాప్స్‌, సర్వీసుల్లో తలెత్తిన సమస్యలను పరిష్కరిస్తున్నామంటూ పోస్టు చేసింది. తాము చేస్తున్న ప్రయత్నాల్లో పురోగతి కనిపిస్తోందని ప్రకటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *