సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేడు, శనివారం ఉదయం ఏపీ ముఖ్యమంత్రి, నారా చంద్రబాబు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఉడవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ ఈ భేటీకి ఎంపీలు,తో పాటు రాష్ట్ర మంత్రులు కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చంద్రబాబు మంత్రులు, లోక్ సభ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ఈ నెల 22వ తేదీ నుంచి ప్రారంభమవుతున్న పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, లేవనెత్తాల్సిన అంశాలపై చంద్రబాబు వారికీ దిశా నిర్ధేశ్యం చేసారు. కేంద్రంనుంచి తెచ్చుకోవాల్సిన నిధులు, పైన అమరావతి, పోలవరం వంటి ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వ సాయం వంటి అంశాలపై విస్తృత సమన్వయంపై చర్చించారు.జలజీవన్ మిషన్, దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లో వివిధ ప్రాజెక్టులకు భూముల కేటాయింపునకు సంబంధించిన పెండింగ్ అంశాల పరిష్కారంపై చర్చించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ సమస్య పైన కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం వ్యవహరించి రాష్టానికి మేలు చేసే దిశగా అడుగులు వేయించాలని పేర్కొన్నారు.
