సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అక్కినేని నాగార్జున అగ్ర హీరోగా వెనుకబడిపోయాడు కానీ ‘బిగ్ బాస్ గా మాత్రం ప్రతి తెలుగువాడికి రైట్ ఛాయిస్’.. అనిపిస్తాడు .. తెలుగు టివి ఛానెల్స్ ఆడియన్స్ కు ఫేవరెట్‌ రియల్టీ షో బిగ్‌బాస్‌ సరికొత్త సీజన్‌ త్వరలో ప్రారంభం కానుంది. బిగ్‌బాస్‌ సీజన్‌ 8 కు సంబంధించిన తొలి అప్‌డేట్‌ వచ్చింది. ఈ సీజన్‌ లోగో విడుదలైంది. నిజానికి 4, 5, సీజన్ లలో బాగా తగ్గుతూ వచ్చిన బిగ్ బాస్ సీజన్ క్రేజ్ గత సీజన్ 7 ప్రేక్షక ఆదరణ పొందటంతో దానికి పునః జన్మ లభించింది అనిచెప్పవచ్చు.. గత కొన్ని సీజన్ల నుంచి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న నాగార్జున 8వ సీజన్ కు కూడా హోస్ట్‌గా కనిపించనున్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌ (ట్విటర్‌)లో పోస్ట్‌ పెట్టారు. ‘ఇన్ఫినిటీ ఆఫ్‌ ఫన్‌ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసం సిద్థం కండి’ అని పేర్కొన్నారు. మరి ఈసారి ఇంటి సభ్యులుగా ఎవరెవరు పాల్గొనున్నారు అన్నది బహుశా ఆగస్టు చివరలో ప్రారంభమయ్యే బిగ్ బాస్ 8 లో సెలబ్రెటీ లు ఎవరు అన్నది మరి కొద్దీ రోజులలో తెలుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *