సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బాహుబలి, సినిమా విజయాలు తో ఆస్కార్ అవార్డ్స్ సాధించిన చిత్రాలతో ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడిగా ఎదిగిన టాలీవుడ్ అగ్ర దర్శకుడు రాజమౌళిపై ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ ‘మోడ్రన్ మాస్టర్స్’ (Modern Masters) పేరుతో డాక్యుమెంటరీ రూపొందించింది. ఇందులో రాజమౌళి సినీ ప్రస్థానం ను చూపించనున్నారు. ఆగస్టు 2 నుంచి నెట్ఫ్లిక్స్ వేదికగా ఇది స్ట్రీమింగ్ కానుంది. తాజాగా దీనికి సంబంధించిన ట్రెలర్ను విడుదల చేయగా అది అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అందులో టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ సినీ ప్రముఖులు రాజమౌళిపై వారి అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రభాస్, ఎన్టీఆర్, రామ్చరణ్, లతోపాటు టైటానిక్, అవతార్ ఫేమ్, హాలీవుడ్ నెంబర్ వన్ దర్శకుడు జేమ్స్ కామెరూన్, మాట్లాడుతూ.. రాజమౌళికి సాధ్యం కానిది ఏదీ లేదు. ఎవరితోనైనా పని చేయగలరు. ఆయనంటే నాకెంతో గౌరవం – అని కితాబు ఇవ్వడం పెద్ద హైలైట్ గా పేర్కొనాలి.
