సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఫై రాష్ట్రాల నుండి( మహారాష్ట్ర, కర్ణాటక ) వస్తున్నా వరద నీటితో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి నీటిమట్టం గంటగంటకు పెరుగుతుంది. నేటి మంగళవారం ఉదయం ఏడు గంటల వరకు ధవలేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద 14 అడుగులకు నీటి మట్టం చేరింది. ఏజెన్సీలో గంటగంటకు వరద ప్రభావం పెరగడంతో ముంపు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ధవలేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. నేటి మంగళవారం తెల్లవారు జామున2గంటల సమయంలోనే రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. సుమారు 13లక్షల14వేలు క్యూసెక్కుల నీటిని దిగు ప్రాంతానికి వదులుతున్నారు. మరోవైపు తెలంగాణలోని .భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి కొనసాగుతోంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద నీటిమట్టం 49.50 అడుగులకు చేరింది. భద్రాచలం వద్ద 11 లక్షల 44వేల 645 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
