సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మనదేశంలో ఏ ప్రాంతానికి వెళ్లినా పాములు, కుక్కలు కచ్చితంగా కనిపిస్తాయి.అయితే, ఒక్క పాము కూడా కనిపించని రాష్ట్రం ఒకటి మన భారతదేశంలోనే ఉందని మీకు తెలుసా.? దేశంలో అత్యంత విషపూరిత రాష్ట్రంగా కేరళ ప్రసిద్ధి పొందింది. అయితే కేరళ నుండి సముద్ర ప్రయాణానికి అనుకూలంగా ఉండే భారత్ దేశ కేంద్ర పాలిత ప్రాంతం అయిన లక్ష్య దీప్ ల్లో పాములతో పాటు కుక్కలు కూడా కనిపించవు. అదే పెద్ద విశేషం. దేశంలో పాములు కనిపించని ఏకైక ప్రాంతం లక్షద్వీప్. లక్షద్వీప్‌ను పాము రహిత ప్రాంతంగా ప్రకటించారు.ఇక్కడ విచిత్రంగా కుక్కలు కూడా కనిపించవు. లక్షద్వీప్‌కు వచ్చే పర్యాటకులు సైతం ఇక్కడకు కుక్కలను తీసుకురాకూడదు. . దీన్ని రేబిస్ రహిత రాష్ట్రంగానూ పిలుస్తుంటారు. అంటే ఇది పాము, కుక్క లేని రాష్ట్రంగా గుర్తింపు ఉంది. ఇకపోతే, లక్షద్వీప్‌లో కాకులు, పక్షులు ఎక్కువగా కనిపిస్తాయి. ప్రధాని మోడీ చొరవతో ఇటీవల లక్ష్యదీప్ లో టూరిజం బాగా పెరిగిన విషయం అందరికి తెలిసిందే..
